ఆ పుకార్లను నిజం చేసిన విశాల్..మరో భామతో ప్రేమ

ఈ మధ్య కాలంలో సైలెంట్ అయిపోయిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే నూతన సంవత్సరాదిని పునస్కరించి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. న్యూఇయర్ సందర్భంగా విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఇప్పటివరకు షేర్ చేసిన ఫోటోల్లో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉండేది కానీ నిన్న పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆ కాస్తంత గ్యాప్ కూడా కనిపిండం లేదు. అంతే కాక గుత్తా జ్వాలకు విశాల్ ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉండటం విశేషం. వీటిని ఆమె మై బేబీ అంటూ పోస్ట్ చేసింది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని కొన్నిరోజుల నుండి జరుగుతున్న ప్రచారానికి తాజా ఫోటోలు ఊతం ఇచ్చాయని చెప్పాలి. విష్ణు విశాల్ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని కూడా టాక్ ఉంది. విష్ణు విశాల్ గత ఏడాది జూన్‌లో తన భార్య రజనీతో విడిపోగా గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయింది. మరి వీరి ప్రేమాయణం పెళ్లి దాకా వెళ్తుందో లేదో చూడాలి.