English   

బికినీ పిక్స్ తో రచ్చ రేపుతున్న ఇలియానా

Ileana DCruz
2020-01-02 11:30:53

ఇల్లీ బేబీ నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. దేవదాసు సినిమా ద్వారా పరిచయమై పోకిరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. ఆ మధ్యన ఫారిన్ ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన నటి ఇలియానా సినిమాల్ని,సోషల్ మీడియాని సైతం పట్టించుకోలేదు. అయితే  ప్రియుడితో బ్రేకప్ అయ్యాక డిప్రెషన్ లోకి వెళ్లి బాగా బరువు పెరిగి ఇప్పుడు ఆ రచ్చ నుండి బయటపడేందుకు తనకెంతో ఇష్టమైన గ్లామర్ ఫీల్డ్ లోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. అందుకోసం తన హాట్ ఫొటోలును బయటకు వదిలి వేడి రేపుతోంది. అయితే అవి పాత ఫొటోలని, ఇప్పుడు ఇలియానా ని చూసిన వారు ఇట్టే గుర్తించేస్తారని అంటున్నారు. అప్పట్లో ఆమె దాచిన ఫొటోలను ఇప్పుడు తెలివిగా అప్ లోడ్ చేస్తోందని అంటున్నారు. ఇలియానా ఇంకా లావుగానే ఉందని అంటున్నారు.

More Related Stories