English   

భర్తకు దూరమైన టాలీవుడ్ యాంకర్.. ఇండస్ట్రీ షాక్..

Tollywood
2020-01-02 11:47:02

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటి, యాంకర్ కూడా. ఇప్పటి వరకు ఎంతమంది యాంకర్లు వచ్చిన ఆమెను కొట్టేవాళ్ళు మాత్రం ఇంకా రాలేదు. ఇక వస్తుందని నమ్మకం కూడా లేదు. అలాంటి టాప్ యాంకర్ కు ఇప్పుడు చెప్పుకోలేని ఫ్యామిలీ కష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ఈమె కొన్నాళ్లుగా తన భర్తకు దూరంగా ఉందని ఇండస్ట్రీలో ప్రచారం జోరుగా జరుగుతోంది. 

దాదాపు రెండు దశాబ్దాల కింద పెళ్లి చేసుకున్న వీళ్ళు ఇప్పటివరకు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల కాపురంలో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. ఏదో పెద్ద వాళ్ల కోసం కొన్ని ఏళ్లుగా కలిసి ఉన్నారు కాని మనస్ఫూర్తిగా మాత్రం కాదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పెద్ద వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కొన్నేళ్లు పిల్లల కోసం సర్దుబాటు చేసుకున్నారు.. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల కాపురం పూర్తిగా చేజారిపోయిందని.. ఒకరినొకరు చూసుకో లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే కొన్ని రోజులుగా ఆమె భర్తకి దూరంగా ఉంటూ ఒంటరిగా కాలం గడుపుతోంది. పైగా పిల్లలు కూడా తన దగ్గరే ఉంచుకోవాలని చూస్తుంది. 

ఇక్కడ మరో దారుణం ఏంటంటే ఆ ప్రముఖ యాంకర్ కొడుకు కూడా 20 ఏళ్లు కూడా రాకుండానే దారి తప్పాడని డ్రగ్స్ కు బానిస అయిపోయాడు అని ప్రచారం కూడా జరుగుతోంది. ఆ కుర్రాన్ని తీసుకెళ్లి డ్రగ్స్ మాన్పించే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా తమ ఇంటి సభ్యురాలుగా ఉన్న ఆమెకు వచ్చిన కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భర్త పనికి రాకుండా ఉండి.. తాను మాత్రమే సంపాదించి పెడుతుంటే బలాదూర్గా తిరగడం ఆమెకు అసలు నచ్చడం లేదని అందుకే ఇక తెగతెంపులు చేసుకోవడం నయం అనే నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడ ఆగుతుందో చూడాలి 

More Related Stories