English   

ప్రభాస్ సినిమా నుండి ఆసక్తికర అప్డేట్

 Prabhas
2020-01-02 12:00:03

ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత ప్యాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టాడు. బాహుబలి విజయం తర్వాత సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేశారు. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో ఫలితం భారీ దేబ్బెసింది. కాగా ఆ తర్వాత రాధా కృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా చేస్తున్నారు. సాహో ఎఫెక్ట్ జాన్ మీద పడి ప్రభాస్ అండ్ టీమ్ జాగ్రత్త పడ్డారు. దాదాపు సాహోకు పని చేసిన టీమ్ జాన్ కు మళ్ళీ పని చేస్తుండడంతో జాన్ కు మొత్తం రీ వెరిఫికేషన్ చేసారు. స్క్రిప్ట్ ను మళ్ళీ రీరైట్ చేయడంతో పాటు బడ్జెట్ ను కూడా 40 శాతానికి పైగా కుదించారు. ముందు మొత్తం విదేశాల్లో షూటింగ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు హైదరాబాద్ లోనే వివిధ స్టూడియోల్లో, ప్రైవేట్ స్థలాల్లో సెట్స్ వేసి వాటిని షూట్ చేయబోతున్నారు. ఇప్పటికే అన్నపూర్ణలో సెట్ కంప్లీట్ కావడంతో ఇక్కడ రెండో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. ఈ వారంలోనే జాన్ షూటింగ్ తిరిగి మొదలుకాబోతోందని ప్రభాస్ టీమ్ నుండి అందుతున్న సమాచారం. జాన్ సినిమాని ఇండియాలోనే మెజారిటీ భాగాన్ని షూట్ చేయాలనీ భావిస్తున్నారని అంటున్నారు. గోపీ కృష్ణా మూవీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 

More Related Stories