English   

గోవాలో ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్...

Ram Charan
2020-01-02 12:37:53

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు.  ఉపాసనతో కలిసి ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా వెళ్లారు. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయిన రామ్ చరణ్ ఫోటోగ్రాఫర్‌గా మారిపోవడం మాత్రమే కాదు టైమ్ దొరికినప్పుడల్లా వైఫ్‌తో కలిపి ట్రిప్స్‌కు కూడా వెళ్తున్నాడు. కాగా జనవరి 3న ఈ జంట తిరిగి హైదరాబాద్‌ రానున్నా రు. ఆ వెంటనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ వర్క్‌తో బిజీ కానున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ మరో వైపు చిరు 152వ సినిమాకి సంబంధించిన నిర్మాణ బాధ్యతలని కూడా చూసుకుంటున్నారు. అయితే ఆ సినిమా నిర్మాణ బాధ్యతల నుండి చరణ్ ను తప్పుకోమని రాజమౌళి సలహా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ మరో రెండు మూడు నెలలలో పూర్తి కావస్తున్న నేపథ్యంలో అసలు పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా ఆ తర్వాత మరో సినిమాని మొదలు పెట్టాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడనీ అంటున్నారు.

More Related Stories