పవన్ తో త్రివిక్రమ్ భేటీ...అందుకేనా

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీళ్లిద్దరు కలిసి తొలిసారి ‘జల్సా’ సినిమా చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అత్తారింటికీ దారేది’ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అందరీ అంచనాలు తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాయనున్నారని అంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్.. ‘పింక్’ రీమేక్‌కు సంబంధించి డైలాగ్ వెర్షన్ పూర్తి చేసినట్టు చెబుతున్నారు. అయితే విజయవాడలో త్రివిక్రమ్, పవన్ ని కలవడం ఆసక్తి కరంగా మారింది. త్రివిక్రమ్ పవన్ కలయికపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది. పింక్ రీమేక్ విషయంలో త్రివిక్రమ్ కలిసారా లేదంటే స్నేహం కొద్దీ కలిసారా అనే దానిపై క్లారిటీ లేదు.