English   

మా రచ్చ..చిరుకి అడ్డుపడిన రాజశేఖర్.. చిరు ఫైర్

 Chiranjeevi
2020-01-02 14:25:49

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ లో ఎప్పుడు ఎలాంటి అల్లర్లు జరుగుతాయో.. ఎప్పుడు ఎవరిపై మాటల తూటాలు పేల్చుకుంటారో అర్థం కాదు. వాళ్ళలో వాళ్ళు అంతా మా అనుకుంటారు.. కానీ లోలోపల మాత్రం మీరు మేము అంటూ సిగపట్లు పడుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మళ్ళీ రచ్చ మొదలైంది. కొత్త అధ్యక్షుడు నరేష్ వచ్చిన తర్వాత చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆయన పనితీరుపై సభ్యులు కూడా అసంతృప్తితో ఉండటంతో ఇది మరింత పెరిగిపోతుంది.

 తాజాగా మా అసోసియేషన్ మీటింగ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ మధ్య రచ్చ తారాస్థాయికి చేరిపోయింది. ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎంతగా ఉన్నాయనేది ఇప్పుడు మరోసారి బయటపడింది. చిరు మాట్లాడుతున్నపుడు మైక్ లాక్కోవడం సంచలనంగా మారిపోయింది. చెడు చెవిలో.. మంచి మైక్ లో చెప్పాలంటూ చిరంజీవి చెబుతున్నపుడు ఇక్కడ చాలా మందికి నిజాయితీ లేదంటూ రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. దాంతో మరోసారి మా గొడవలు బయటికి వచ్చేసాయి. 

ఆ మధ్య ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా మా మీటింగ్ తర్వాత కంటతడి పెట్టుకుంటూ బయటకు వచ్చేశారు. మా అధ్యక్షుడు నరేష్‌ పనితీరుపై ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మా తీరుపై 30 ఇయర్స్ పృథ్విరాజ్‌ కూడా ఆ మధ్య తీవ్ర విమర్శలు చేసాడు. ఇంకా ఎక్కువ చేస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మా అధ్యక్షుడు నరేష్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారని ప్రచారం జరుగుతుంది. 

ఇప్పుడు మరోసారి మా మీటింగ్ లో లొసుగులు బయటికి వచ్చాయి. మా అధ్యక్షుడు నరేష్‌తో సంబంధం లేకుండా ఆయనతో అవసరం లేకుండా ఒక సాధారణ మీటింగ్ ఉంటుందని మా సభ్యులకు జీవిత ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది ఆ మధ్య. అసలు అధ్యక్షుడు నరేష్ తో జీవిత రాజశేఖర్ కు పడట్లేదని చాలా రోజులుగా వస్తున్న వార్త. ఇప్పుడు అదే బయటికి వచ్చింది. ఈ సారి ఏకంగా చిరు, రాజశేఖర్ గొడవ పడటంతో మా రచ్చ తారాస్థాయికి చేరిపోయింది.

More Related Stories