English   

రాజశేఖర్‌ది పిల్లాడి మనస్తత్వం..క్షమించండి: జీవిత

Jeevitha
2020-01-02 16:25:48

భర్త చేసిన పొరపాటును కవర్ చేయడానికి చాలా కష్టపడింది జీవిత. మా అసోసియేషన్‌లో జరిగిన రచ్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు.. స్టేజీపై ఆయన ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అసలు మా సభ్యుల్లో చాలా మందికి నిజాయితీ తగ్గిందని రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజశేఖర్ చేసిన కామెంట్స్ తో అక్కడున్న వాళ్లకు మండిపోయింది. తోటి సభ్యులను అలా ఎలా మాట్లాడతారు.. సభ్యత లేకుండా అలా ఎలా సంభోదిస్తారంటూ చిరంజీవి కూడా సీరియస్ అయ్యాడు. దాంతో మరోసారి రాజశేఖర్, చిరంజీవి మధ్య ఉన్న లొసుగులు బయటకి వచ్చాయి. అయితే అందర్లోనూ రాజశేఖర్ విలన్ కావడంతో ఆ బాధ్యతను ఆయన భార్య జీవిత తీసుకుంది. రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటూ కవర్ చేసింది జీవిత. చిరంజీవి లాంటి వాళ్ల దగ్గర్నుంచి మేం చాలా నేర్చుకున్నామంటూ చెప్పుకొచ్చింది. మా కు ఆయన ఎంతో చేసారంటూ మునగ చెట్టెక్కించే ప్రయత్నం చేసింది జీవిత. దాంతో అక్కడున్న వాతావరణం కాస్త కూల్ అయింది. కానీ అది మాత్రం తాత్కాలికమే. అప్పటి వరకు వేదిక చాలా వేడిగా ఉండటంతో వచ్చి తన మాటలతో వెన్న పూసే ప్రయత్నమైతే బాగానే చేసింది జీవిత. కానీ అదెంత వరకు రాజశేఖర్‌పై చిరంజీవికి ఉన్న కోపాన్ని తగ్గిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
 

More Related Stories