English   

సంక్రాంతికి థియేట‌ర్స్ ఎక్క‌డ‌.. నాలుగు సినిమాకు న‌ర‌క‌మే..

Tollywood
2020-01-02 18:15:46

సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఆ రోజు కచ్చితంగా సినిమా చూసి కానీ ఇంటికి రారు కొంతమంది అభిమానులు. అంత పిచ్చి ఉంటుంది సంక్రాంతికి. ఇప్పుడు ఈ సంక్రాంతి కూడా అలాగే ఉండబోతుంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు పండ‌క్కి రాబోతున్నాయి. ఇప్పుడు ఇదే వణుకు పుట్టిస్తుంది బ‌య్య‌ర్ల‌కు కూడా. నాలుగు సినిమాలు రావడం బాగానే ఉంది కానీ వాటికి థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అంటూ ప్రశ్న మొదలైందిప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1600 థియేటర్లలో నాలుగు భారీ సినిమాలకు ఎలా పంచుతారంటూ అనుమానాలు మొదలయ్యాయి. 

ఈ పండక్కి మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్, రజినీకాంత్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు కూడా వస్తున్నారు. మరి వీళ్ళందరికీ ఎన్ని థియేటర్లు ఇస్తారు.. ఒక్కో సినిమాకు ఎన్ని స్క్రీన్ లు పంచుతారు అనేది అర్థం కాక అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు.ఇందులో మహేష్ బాబుకు సపోర్టుగా దిల్ రాజు ఉన్నాడు.. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ ఉన్నాడు. కళ్యాణ్ రామ్ పరిస్థితేంటి.. ఇక రజినీకాంత్ ఏం చేస్తాడు అనేది ఇప్పుడు అర్థం కావడం లేదు. 

ముఖ్యంగా గతేడాది రజినీ నటించిన పేట సినిమాకు సరైన థియేటర్స్ ఇవ్వలేదని అప్పట్లో గొడవ కూడా జరిగింది. మన సినిమాలకే థియేటర్స్ లేనపుడు డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎక్కడ్నుంచి వస్తాయంటూ దిల్ రాజు కూడా పంచ్ వేసాడు. అయితే చాలా మందికి ఎవరికి వారు సొంతంగా థియేటర్స్ మ్యానేజ్ చేసుకోగలిగిన స్థాయి నిర్మాతలే ఈ సినిమాల‌ను నిర్మించారు. అందుకే అంతా ఒకేసారి దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ సారి దర్బార్ సినిమాకు సరైన సంఖ్యలో స్క్రీన్స్ వస్తాయా లేదా అనేది చూడాలి. 

జనవరి 9న దర్బార్.. 10న అల వైకుంఠపురములో.. 11న సరిలేరు నీకెవ్వరు.. 15న ఎంత మంచివాడవురా విడుదల కానున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి ఎవ‌రి జాత‌కం ఎలా మార‌బోతుంద‌నేది చూడాలిక‌.

More Related Stories