English   

అయ్యో పాపం ర‌జినీకాంత్ కు ఏంటి ఈ క‌ష్టాలు..

raj
2020-01-02 18:42:26

సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక కొట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడు నుంచి రజనీకాంత్ వచ్చాడు. ఇప్పుడు ఆయన చూపిస్తున్న పంతం దర్బార్ సినిమాకు శాపంగా మారేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు థియేటర్లు తెలుగులో దక్కడం లేదని వార్తలు ఇప్పుడు అభిమానులను భాధపెడుతున్నాయి. రజనీకాంత్ సినిమా థియేటర్లు లేకపోవడం ఏంటి వాళ్ళు మౌనంగా రోదిస్తున్నారు.

ఒకప్పుడు ఈయన సినిమా వస్తుంది అంటే మిగిలిన సినిమాలు రావడానికి భయపడేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రజనీకాంత్ సినిమా కూడా కనీసం పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక బయ్యర్లు కూడా రజనీ సినిమా కంటే కూడా మిగిలిన సినిమాల వైపు అడుగులు వేస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తెలుగులో కొన్ని రోజుల తర్వాత విడుదల చేయాలని ముందు అనుకున్నా కూడా రజనీకాంత్ రెండు భాషల్లో ఒకేసారి రావాలని పట్టుబట్టారు. దాంతో మరో ఆప్షన్ లేక జనవరి 9న విడుద‌ల చేస్తున్నారు దర్బార్ సినిమాను. జనవరి 3న ప్రీ రిలీజ్ వేడుక కూడా జరగనుంది. కానీ అప్పటికే ఇక్కడ మూడు సినిమాలు థియేటర్లు బ్లాక్ చేసుకున్నాయి. ఇలాంటి సమయంలో వచ్చిన రజినీకాంత్ సరైన స్క్రీన్స్ లేక ఇబ్బంది పడ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఇప్పుడు ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కొన్ని ఏరియాల్లో అయితే డిస్ట్రిబ్యూటర్లు లేక నిర్మాత సొంతంగా విడుదల చేసుకుంటున్నాడు అని తెలుస్తోంది. మొత్తానికి దర్బార్ ఎన్ని థియేటర్స్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది అనేది జనవరి 9న తేలనుంది.

More Related Stories