English   

సంక్రాంతికి థియేటర్స్ బంద్.. హీరోలకు షాక్..

the
2020-01-03 04:58:33

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఒకే టాపిక్ పై సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానుల విషయంలో రైతుల ఆందోళనలు రోజురోజుకీ తారాస్థాయికి చేరిపోతున్నాయి. ఈ విషయంపై అటు పవన్ కల్యాణ్ కూడా పోరాడుతున్నాడు. అయితే దీనిపై ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి మినహా ఎవరూ మాట్లాడలేదు. దాంతో టాలీవుడ్ ఎందుకు మూడు రాజధానుల విషయంలో నోరు మెదపడం లేదు.. వాళ్లకు మాత్రం బాధ్యత లేదా అంటూ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖులు కానీ స్పందించకపోతే సంక్రాంతి మూడు రోజులు థియేటర్లను బంద్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు అభిమానులు కూడా వాళ్ల వాళ్ల హీరోలపై ఒత్తిడి తీసుకరావాలని సూచించింది కాంగ్రెస్. ఏదో ఓ నిర్ణయం కచ్చితంగా జనవరి 10 లోపు చెప్పాల్సిందే అని లేదంటే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు వాళ్లు. ఈ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని చిరంజీవి స్వాగతించారు.

సమగ్రాభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపాడు. గతంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ నివేదిక, ప్రస్తుత జీఎన్‌రావు కమిటీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని చిరు ఏపీ సిఎం జగన్ కు మద్దతు నిలిచాడు. కానీ అదే సందర్భంలో పవన్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఒకే కుటుంబం నుంచి అన్నాదమ్ములు ఇద్దరూ రెండు వేర్వేరు ధోరణులు పలికించారు. నిజంగానే కాంగ్రెస్ కానీ అనుకున్నంత పని కానీ చేస్తే ముందు పండగ చేసుకునేది రజినీకాంత్ ఒక్కడే. ఎందుకంటే ఈయన నటించిన దర్బార్ పండక్కి వస్తుంది. ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా కూడా ఇదే పండక్కి రానున్నాయి. ఈ నాలుగు సినిమాలపై మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలే దాదాపు 280 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఇచ్చిన వార్నింగును మన హీరోలు ఎంతవరకు బుర్రకు ఎక్కించుకుంటారో చూడాలిక.

 

More Related Stories