English   

ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానుల హల్చల్...క్రేజ్ అంటే అదీ

ntr
2020-01-03 05:09:06

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. తన నట విశ్వరూపంతో ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్న ఎన్.టి.ఆర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు ఆయన అభిమానులు. తారక్ పుట్టిన రోజైనా పండగ రోజైనా తారక్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. ఇక మొన్న న్యూ ఇయర్ సందర్భంగా ఎన్.టి.ఆర్ ఇంటి ముందు నందమూరి ఫ్యాన్స్ హంగామా చేశారు. వారిని నిరుత్సాహపరచకుండా తారక్ కూడా మేడ మీదకు ఎక్కి వారికి అభివాదం చేశారు. ఇంటి మీద నుండి తారక్ తన ఫ్యాన్స్ కు అభివాదం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ మరో కథానాయకుడుగా నటిస్తున్నాడు. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని రూ.350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను జులై 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయనున్నారట.

 

More Related Stories