ఎన్టీఆర్ ఫోటోకి ముద్దుల వర్షం కురిపించిన హీరోయిన్

దక్షిణాది హీరోయిన్గా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన వెటరన్ హీరోయిన్ ఖుష్బూ. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తున్న ఖుష్బూ తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంకు అటెండ్ అయింది. ఈ సందర్భంగా తారక్ ఫోటోను డిస్ప్లే చేశారు. వెంటనే ఖుష్భూ ఆ ఫోటోకు ముద్దులే ఇచ్చారు. ఇలా ముద్దుల వర్షం కురిపించి తన అభిమానాన్ని చాటుకుంది ఈ నటి. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో యంగ్యమా అనే పాటకు హుషారుతో ఈలలు వేస్తూ. కేకలు పెడుతూ పిచ్చపిచ్చగా డ్యాన్స్‌లు చేసి అలరించింది. అంతేకాక తనకు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో అరవింద స్వామి అంటే ఎంతో ఇష్టమని ప్రకటించింది. ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకుని .. దాన్ని భద్రంగా తమ ఇంటి లాకర్లో సేఫ్‌గా ఉంచిందట. అయితే ఆమె ఎన్టీఆర్ సరసన ఒక సినిమాలో నటించింది కూడా. ఆమె యమదొంగ సినిమాలో యముడిగా నటించిన మోహన్‌బాబుకు జోడిగా నటించింది. అప్పటి నుంచి తనకి తారక్ అంటే అభిమానం అని చెప్పింది ఈ భామ. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఇక ఖుష్బూ ఏమో రజినీకాంత్ తో మరోసారి జోడీ కట్టేందుకు సిద్ధమవుతుందామె .