English   

త్రివిక్రమ్, అల్లు అర్జున్ మాట కాదన్న చినబాబు..

allu
2020-01-03 05:33:02

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడంటే ఆయన వెనక అండగా ఉండేది చినబాబు.. అదే హారిక హాసిని క్రియేషన్స్. ప్రతీ సినిమాకు కూడా ఈయనే తోడుగా ఉంటాడు. ఇప్పుడు కూడా బన్నీ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాను గీతా ఆర్ట్స్ తో కలిసి ఈయన నిర్మించాడు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నారు. అయితే ముందు నుంచి కూడా ఇదే డేట్ లాక్ చేసుకున్నాడు అల్లు వారబ్బాయి. కానీ మహేష్ బాబు కూడా అదే రోజు రావాలనుకోవడం.. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుని ఓ రోజు ముందుకు రావడం జరిగిపోయాయి. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు వస్తుందిప్పుడు. అన్నీ బాగానే జరుగుతున్నాయనుకున్న టైమ్ లో జనవరి 10నే అల వైకుంఠపురములో సినిమాను విడుదల చేయాలని బన్నీ పట్టుబట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో త్రివిక్రమ్ కూడా హీరోకే సపోర్ట్ చేయడంతో పని సులువుగానే జరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా ప్రీపోన్ చేయడానికి నిర్మాత చినబాబు మాత్రం అస్సలు ఒప్పుకోలేదని.. ఆయన ససేమిరా అనడంతోనే మళ్లీ అదే డేట్ కు అల వైకుంఠపురములో వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో చినబాబుకు ఎంత చెప్పాలని చూసినా కూడా ఆయన వినలేదని తెలుస్తుంది. అందుకే జనవరి 12నే ఈ చిత్రం విడుదల కానుంది. ఏదేమైనా కూడా ఓ స్టార్ హీరో.. డైరెక్టర్ పట్టుబట్టినా కూడా నిర్మాత వినలేదంటే మాత్రం నిజంగా ఆశ్చర్యమే.

More Related Stories