English   

రేణుకి ఇంత సడన్ గా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో 

Renu Desai
2020-01-03 10:30:38

చానాళ్లు సహజీవనం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రేణూదేశాయ్‌ లు అనంతరం పెళ్లి చేసుకున్నారు. అయితే పవన్ మరో ఆమెను వివాహం చేసుకోవడంతో రేణు పవన్ తో విడిపోయి విడిగా జీవ‌నం సాగిస్తున్నారు. ఆ మ‌ధ్య త‌న‌కి వేరే వ్య‌క్తితో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని, త‌న ద‌గ్గ‌ర ప‌వ‌న్ ప్ర‌స్తావ‌నే తీసుకురావొద్ద‌ని సోషల్ మీడియా వేదికగా రేణూ హెచ్చ‌రించింది కూడా. అంతేకాక ఈ మధ్య వారి పిల్లలు ఆద్య‌,అకీరాలు ప‌వ‌న్ ర‌క్తం అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా ఆయ‌న త‌న‌దైన శైలిలో ధీటుగా బ‌దులిచ్చింది రేణూ. అయితే ఈ కామెంట్స్ చేసినవారిని అందరినీ విస్మయ పరిచేలా తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌వ‌న్‌తో ఆద్య క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూపిల్లలు త‌ల్లిదండ్రుల నుండి పోలిక‌లు లాగేసుకుంటారు. ఇదో మ్యాజిక్. నా కూతురు ఆద్య అప్పుడ‌ప్పుడు నాన్న‌లాగే ఉంద‌నిపిస్తుంది. ఆద్య ఎక్కువ సార్లు వాళ్ళ నాన్న‌మ్మ‌, నాన్న‌లా క‌నిపిస్తుంది. ఆద్య నా కెమెరాకి ఫేవ‌రేట్ ప‌ర్స‌న్ అంటూ ఆ పిక్ కి కామెంట్ చేసింది రేణు. ఇన్నాళ్ళు ప‌వ‌న్ మాట ఎత్తితే విరుచుకు పడిన రేణూ స‌డెన్‌గా కూతురుతో ప‌వ‌న్ దిగిన ఫోటోని షేర్ చేయ‌డం చర్చనీయాంశం అయింది.

More Related Stories