English   

మెగాస్టార్ కి నో చెప్పిన రేజీనా

Regina Cassandra
2020-01-03 10:43:22

ఎవరు చిత్రంతో చాలా ఏళ్ల తరువాత సక్సెస్ బాట పట్టింది రెజీనా. ఈ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులను కొట్టేసింది. ఆ సినిమాతో ఆమె మళ్ళీ ఫాంలోకి వచ్చిందని ఆమె మీద కొన్ని పుకార్లు మొదలయ్యాయి. త్వరలో తమిళంలో ఓ సినిమాలో నటించనున్నదని అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోందని.. అది కూడా ఐటెం సాంగ్‌లో నర్తించడానికి ఈ బ్యూటి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. చిరంజీవితో నటించే అవకాశం వస్తే ఎవరైనా ఎలాంటి మొహమాటం లేకుండా ఓకే చెబుతారు. కానీ చిరంజీవితో నర్తించే అవకాశాన్ని రెజీనా ఒదులుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా ఈ రోజే షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. ఈ చిత్రంలో రెజీనాను ఐటెం సాంగ్ కోసం సంప్రదించారట. అయితే ఆమె మాత్రం చేయనని చెప్పేసిందట.

More Related Stories