English   

నేను తప్పు చేసాను.. క్షమించండి అంటున్న రాజశేఖర్.. 

Rajasekhar
2020-01-03 10:54:37

'మా' సభ్యులు 2020 డైరీ లాంచ్ ఈవెంట్ చేసారు.. అందులో జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజశేఖర్ చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యపరిచాయి కూడా. చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దల ముందే రాజశేఖర్ రెచ్చిపోయాడు. మీకేం తెలుసు అన్నట్లుగా మాట్లాడేసాడు. దాంతో మెగాస్టార్ కూడా చిన్నబుచ్చుకున్నాడు. 

మాలో వీళ్లకు చాలా విబేధాలున్నాయని.. గొడవలు కూడా జరుగుతున్నాయని ఈ మ్యాటర్ తో మరోసారి బయటికి వచ్చేసాయి. దానికంతంటికి అధ్యక్షుడు నరేష్ కారణమని ఫైర్ అయ్యాడు రాజశేఖర్. అంతేకాదు ఇక్కడ ఎవడూ నిజాయితితో పని చేయడం లేదని.. అంతా కలిసుండాలని చిరంజీవి చెప్పిన మాటలు బాగానే ఉన్నా కూడా అంత బాగా ఎవరూ లేరంటూ కామెంట్ చేసాడు రాజశేఖర్. అంతేకాదు అక్కడ్నుంచి మధ్యలోనే వెళ్లిపోయాడు కూడా. పరుచూరి, చిరంజీవి మాట్లాడుతున్నపుడు మధ్యలోనే మైక్ లాగేసుకోవడం కూడా సంచలనంగా మారింది. ఈ సీన్ అంతా జరిగిన కొద్దిసేపటికే మా ఉపాధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు రాజశేఖర్. దీనిపై లేఖ కూడా విడుదల చేసాడు.

తాను రాజీనామా చేయడానికి నరేష్ ఏకపక్ష నిర్ణయాలే కారణం అంటూ మంట కూడా పెట్టాడు ఈ సీనియర్ హీరో. అంతేకాదు.. ట్విట్టర్ వేదికగా చిరు, మోహన్ బాబులకి క్షమాపణలు చెప్పాడు ఈయన. సభలో ఏం జరిగినా కూడా అది తనకు, నరేశ్ కు, మా సభ్యులకు మధ్య మాత్రమే జరిగింది కానీ ఎవర్ని కించపరచడానికి మాత్రం కాదని చెప్పాడు ఈయన. అక్కడికి వచ్చిన ఏ ఒక్కర్ని కూడా తప్పు పట్టాలని అలా చేయలేదని.. తన వల్ల జరిగిన తప్పుకు క్షమించమని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసాడు రాజశేఖర్. మొత్తానికి ఇంత చేసిన తర్వాత ఏం జరగబోతుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. 
 

More Related Stories