English   

అసురన్ రీమేక్ లో హీరోయిన్ మారిందట

 Venkatesh
2020-01-03 12:02:34

తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్‌ తెలుగులో రీమేక్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది రిలీజయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారు. ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతున్నారని ప్రకటన కూడా చేశారు. ఈ సినిమాని  శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించ‌నున్నాడు. అయితే అక్కడి దాకా సరే కానీ ఇందులో క‌థానాయిక‌గా ఎవ‌రనేది ఇంకా తేలడం లేదు. అయితే ఈ సినిమాలో  హీరో వెంక‌టేష్‌కి జోడీగా ధనుష్ సరసన నటించిన మంజు వారియ‌ర్ పాత్ర‌లో శ్రియ న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అది ప్రచారం వరకే పరిమితం అయింది.  తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రియ కాకుండా ఆ పాత్ర‌లో అవార్డు విన్నంగ్ న‌టి ప్రియ‌మ‌ణి న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మంజు వారియ‌ర్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇది కావ‌డంతో ఆ పాత్ర‌లో అవార్డు విన్నింగ్ న‌టి ప్రియ‌మ‌ణి అయితేనే బాగుంటుంద‌ని సురేష్‌బాబు భావిస్తున్నార‌ని అంటున్నారు. తాజాగా ‘పరుత్తివీరన్’ అనే సినిమాలో ప్రియ‌మ‌ణి ప‌ర్‌ఫార్మెన్స్‌కి నేషనల్ అవార్డ్ ద‌క్కింది. ఇక ఆమె తెలుగు సినిమా చేసి చాలా సంవత్సరాలే అయ్యింది. 

More Related Stories