English   

హీరోకి వార్నింగ్ ఇచ్చిన దీపిక ఫ్యాన్స్

Deepika fan
2020-01-03 12:36:26

సాధారణంగా మనకి నచ్చిన నటీనటులను ఓన్ చేసుకుంటాం. ఇప్పుడు మన జనరేషన్ మాత్రమే కాదు, మన తాతల తరం వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యే వాళ్ళు, సీనియర్ ఎన్టీఆర్ ని ఎన్టీవోడు అని నాగేశ్వర్ రావుగారిని నాగ్గాడు అని, సూపర్ స్టార్ కృష్ణను కిట్టిగాడు అని పిలుచుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు ఆ కల్చర్ కొంచెం ఎక్కువయ్యి మనకి నచ్చిన వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తా అనేట్టు తయారవుతున్నారు. తాజాగా తన అభిమాన నటితో రోమాన్స్ చేయబోతున్నా అని ప్రకటించిన నటుడిని చంపేస్తా అని బెదిరించాడు ఒక నెటిజన్. 

అసలు విషయం ఏంటంటే  బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది ‘త్వరలో నేను దీపిక పదుకోన్, అనన్య పాండేతో కలిసి నటించబోతున్నాను’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ చూసి దీపిక అభిమాని అయిన ఓ నెటిజన్‌కు కోపం వచ్చింది. దాంతో సిద్ధాంత్‌ను అతను హెచ్చరించాడు. ‘సాలే దీపిక పదుకోన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందా నీకు. నిన్ను చంపేస్తా’ అని బెదిరించాడు. అయితే ఈ బెదిరింపులకు సిద్ధాంత్ కామెడీగా ‘ఏం చేయమంటావ్. నన్ను దీపికతో రొమాన్స్ చేయనివ్వు. ఆ తర్వాత నన్ను చంపేయ్. ఎలాగో దీపిక పదుకోన్‌తో రొమాన్స్ చేసి చేసి నేనే చచ్చిపోతా’ అని రిప్లై ఇచ్చాడు. ‘గల్లీ బాయ్’ సినిమాతో సిద్ధాంత్ జాతకమే మారిపోయింది. ఈ సినిమాలో అతని క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సిద్ధాంత్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. సిద్ధాంత్.. అల్లు అర్జున్‌కు వీరాభిమాని. 

More Related Stories