English   

సంక్రాంతి సినిమాల్లో డేంజర్ జోన్‌లో ఉన్న మహేష్ బాబు..

 Sarileru Neekevvaru
2020-01-03 14:00:30

ఈ సంక్రాంతి పండక్కి నాలుగు భారీ సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి డబ్బింగ్ సినిమా కాగా మూడు మన సినిమాలే. రజినీకాంత్ దర్బార్ ఈ సంక్రాంతి రేస్ మొదలుపెడుతున్నాడు. ఈయన జనవరి 9న వస్తున్నాడు. ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించాడు. దాదాపు 3 గంటల నిడివితోనే ఈ సినిమా రాబోతుంది. ఇదిలా ఉంటే మన సినిమాల్లో మాత్రం మహేష్ బాబు భారీ నిడివితో వస్తున్నాడు. ఈ మధ్య భారీ రన్ టైమ్ ఉన్న సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి కానీ మూడు గంటలంటే ఎప్పటికైనా రిస్కే. ఇప్పుడు మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాతో దాదాపు 3 గంటలు తీసుకుంటున్నాడు. ఈయన సినిమా ఫస్టాఫ్ అంతా కామెడీతో సెకండాఫ్ అంతా యాక్షన్ కామెడీతో ఉంటుందని తెలుస్తుంది. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు బై ఏ సర్టిఫికేట్ అందుకుంది. 2 గంటల 48 నిమిషాల డ్యురేషన్ తో ఈ సినిమా వస్తుంది. మహేష్ బాబుకు ఇది కాస్త మైనస్ అవుతుంది. 

ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా 2 గంటల 36 నిమిషాలతో వస్తుంది. త్రివిక్రమ్ మార్క్ ఉంటుంది కాబట్టి పర్లేదనుకోవచ్చు.. ఈయన గత సినిమాలు కూడా దాదాపు ఇదే రన్ టైమ్ తో వచ్చాయి. వచ్చి మాయ చేసాయి కూడా. ఈ ఇద్దరి కంటే తక్కువ నిడివితో వస్తున్నాడు కళ్యాణ్ రామ్. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా సినిమా రెండు గంటల 22 నిమిషాల రన్ టైంతోనే వస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల్లో మహేష్ సినిమా ఎక్కువ రన్ టైమ్ కాగా కళ్యాణ్ రామ్ తక్కువ. ఈ మూడు సినిమాల్లో కూడా మహేష్ బాబు డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఏ మాత్రం బోర్ కొట్టించినా కూడా అసలుకే మోసం వస్తుంది. మరి చూడాలిక.. సంక్రాంతి రేస్ లో ఏం జరగబోతుందో..? జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. 12న అల వైకుంఠపురములో.. 15న ఎంత మంచివాడవురా సినిమాలు విడుదల కానున్నాయి. 

More Related Stories