English   

సురేందర్ రెడ్డి నెక్ట్స్ సినిమా ఎవరితో తెలుసా..

Surender Reddy
2020-01-03 15:39:06

సైరా లాంటి భారీ సినిమా తరువాత సురేందర్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లో కనిపిస్తున్నాడు. ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందా అని చాలా రోజుల నుంచి తర్జన భర్జన పడుతున్నాడు మెగా దర్శకుడు. చిరంజీవితో తెరకెక్కించిన సైరా సినిమా తెలుగులో విజయం సాధించింది కానీ మిగిలిన భాషలలో మాత్రం దారుణంగా పరాజయం పాలైంది. అక్కడ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది సైరా నరసింహారెడ్డి. ఇలాంటి తరుణంలో ఈయన తర్వాత సినిమా ఏ హీరోతో ఉండబోతుంది అనే ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.

దీనికి సమాధానంగా మరోసారి మెగా హీరోని సెలెక్ట్ చేసుకున్నాడు సురేందర్ రెడ్డి. వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఈయన తర్వాత సినిమా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుందని.. త్వరలోనే స్క్రిప్టు కూడా పూర్తి చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. 2020 లోనే సినిమా పటాలెక్కనుంది. 2021లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో అల్లు అర్జున్ కు రేసుగుర్రం.. రామ్ చరణ్ కు ధ్రువ.. చిరంజీవికి సైరా లాంటి సినిమాలు ఇచ్చాడు సురేందర్ రెడ్డి. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాకు ఓకే చెప్పాడు.

More Related Stories