English   

బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన సాయి ధరమ్ తేజ్..

Prati Roju Pandaage
2020-01-03 15:47:55

సాయి ధరంతేజ్ ఏంటి బాహుబలి రికార్డు కు చెక్ పెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరిగింది. నిజంగానే బాహుబలి రికార్డు బ్రేక్ చేశాడు. ఈయన నటించిన ప్రతిరోజూ పండగే సినిమా బాక్సాఫీసు దగ్గర నిజంగానే ప్రతి రోజూ పండగ చేసుకుంటుంది. మార్కెట్లో మరో సినిమా లేకపోవడంతో రెండు వారాల తర్వాత కూడా ఈ సినిమా దూకుడు కొనసాగుతుంది.

మారుతి తెరకెక్కించిన ప్రతి రోజు పండగే ఇప్పటికే 30 కోట్ల షేర్ వసూలు చేసింది. అటు సాయి.. ఇటు మారుతి కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ప్రతిరోజూ పండగే. ఈ దూకుడు చూస్తుంటే మరో పది కోట్ల షేర్ ఈజీగా వసూలు చేసేలా కనిపిస్తుంది. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు మరో సినిమా లేకపోవడంతో పండగ చేసుకుంటున్నాడు సాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రతి రోజు పండగే బాహుబలి రికార్డును క్రాస్ చేసింది. విడుదలైన 13వ రోజు ఈ సినిమా ఏకంగా 2 కోట్ల 91 లక్షల షేర్ వసూలు చేసింది.

జనవరి 1న ఈ అద్భుతం చేశాడు సాయి ధరమ్ తేజ్. తెలుగు ఇండస్ట్రీలో 13వ రోజు దాదాపు మూడు కోట్ల షేర్ వసూలు చేసిన సినిమా బాహుబలి2 మాత్రమే. ఆ సినిమా విడుదలైన 13వ రోజు దాదాపు 5 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలికి కూడా ఇది సాధ్యం కాలేదు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సాయి రెండు వారాల తర్వాత కూడా దాదాపు మూడు కోట్ల షేర్ తీసుకొచ్చాడు. అలా బాహుబలి రికార్డులను తిరగరాశాడు సాయి ధరంతేజ్. ప్రస్తుతం ఈయన సోలో బ్రతుకే సో బెటరూ సినిమాతో బిజీగా ఉన్నాడు.

More Related Stories