English   

వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ రివ్యూ.. అర్జున్ రెడ్డి సీక్వెల్..

World Famous Lover Teaser
2020-01-03 16:26:55

మనం ఎక్కడ్నుంచి వచ్చామో ఆ మూలాలను అస్సలు మరిచిపోకూడదు. ఇప్పుడు విజయ్ దేవరకొండను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయన నటిస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత ఈయన చే్తున్న సినిమా ఇది. క్రాంతిమాధ‌వ్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ విడుదలైందిప్పుడు. అప్పట్లో విడుదలైన పోస్టర్ లోనే వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ చేతిలో సిగరెట్ పట్టుకుని మొహంలో ఫ్రస్టేషన్ చూపించాడు విజయ్. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.

 టీజర్ మొత్తం లవ్, పెయిన్ తో పాటు ఇంకా చాలా చూపించాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా అర్జున్ రెడ్డికి ఇది సేమ్ టూ సేమ్ అన్నట్లుగా కనిపిస్తుంది. బ్యాక్ టూ పెవిలియన్ అన్నట్లుంది ఇప్పుడు విజయ్ పరిస్థితి. టీజర్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది కూడా. ఇప్పుడు దీన్ని విడుదల చేసారు. ఓనమాలు తర్వాత మళ్లీ మళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమా చేసిన క్రాంతి.. ఉంగ‌రాల రాంబాబుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజ‌య్ ఉన్న పొజిష‌న్ ప్ల‌స్ క్రేజ్ ను క్రాంతి ఎంత‌వ‌ర‌కు హ్యాండిల్ చేస్తాడు అనేది అంద‌ర్లోనూ ఉన్న అనుమానం. 

అయితే ఇక్క‌డ మ‌రో అడ్వాంటేజ్ కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ద‌ర్శ‌కుల‌ను రెస్పెక్ట్ చేయ‌డం బాగా తెలుసు. క‌థ డిమాండ్ చేస్తే కాళ్లు ప‌ట్టుకోడానికి కూడా సిద్ధంగానే ఉంటాడు ఈ హీరో. గీత‌ గోవిందంలో కూడా ఇదే చేస్తాడు విజ‌య్. హీరో వ‌ర్షిప్ కంటే కూడా న‌టుడిగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాడు విజ‌య్. క్రాంతి సినిమాలో కూడా ఇదే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, కేథరిన్ థ్రెసా, ఎజిబెల్లా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్ లో అందర్నీ కవర్ చేసాడు దర్శకుడు క్రాంతి మాధవ్. పైగా విజయ్ లుక్ కూడా ఒక్కో హీరోయిన్ తో ఒక్కోలా ఉంది. అందుకే సినిమాకు వలర్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ పెట్టారు. క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం.

More Related Stories