English   

దర్బార్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా..

Rajinikanth Darbar
2020-01-03 18:26:00

రజినీకాంత్ దర్బార్ సినిమాకు చెప్పుకోలేని కష్టాలు వస్తున్నాయి. ఒకప్పుడు ఆయన సినిమా వచ్చింది అంటే థియేట్రికల్ రైట్స్ కోసం ఎగబడి కొనేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు. పదేళ్ల కింద వచ్చిన రోబో సినిమాను కూడా తెలుగులో 30 కోట్లకు కొన్నారు. ఆ తర్వాత కబాలి, 2.0 సినిమాలు కూడా మంచి బిజినెస్ చేశాయి. కానీ ఇప్పుడు మాత్రం చాలా దారుణమైన బిజినెస్ జరుగుతుంది. దర్బార్ సినిమాను కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్త అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది.

జనవరి 9న తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ సినిమా. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ బాగుండటంతో తెలుగులో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను కేవలం 14 కోట్లకు అమ్మారు దర్శక నిర్మాతలు. గతంలో రజనీ సినిమా అంటే కనీసం 20 కోట్లకు పైగా బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు దర్బార్ ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువగానే జరిగింది. 

అయితే సంక్రాంతి మరో మూడు భారీ సినిమాలు ఉండటంతో రజనీకాంత్ కు ఎంత వరకు థియేటర్లు వస్తాయి.. ఇప్పుడు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతవరకు పూర్తవుతుంది అనేది అనుమానంగా మారింది. సినిమాకు టాక్ మంచిగా వస్తే ఖచ్చితంగా తన సత్తా చూపించడం ఖాయం. కానీ తేడా జరిగితే మాత్రం అసలుకే ఎసరు వస్తుంది. అసలే గత నాలుగేళ్లుగా వరుస పరాజయాలతో రజనీకాంత్ కెరీర్ చాలా డైలమాలో ఉంది. మరి ఇప్పుడు దర్బార్ సినిమాతో ఆయన ఏం చేస్తాడో చూడాలి.
 

More Related Stories