English   

నువ్వా నేనా అంటున్న మహేష్ బాబు, అల్లు అర్జున్..

Mahesh Babu Allu Arjun.jpg
2020-01-04 08:13:03

సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ నిజంగానే నువ్వా నేనా అనుకుంటున్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అసలు ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఒకరు జనవరి 11న.. మరొకరు 12న డేట్స్ కూడా ఫిక్స్ చేసారు.

ముందు మహేష్ బాబు.. తర్వాత బన్నీ రావాలనుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ అసలు రచ్చ మొదలైంది. ఈ రెండు సినిమాల సెన్సార్స్ పూర్తైపోయాయి కానీ రిలీజ్ డేట్స్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పోస్టర్స్ పై సంక్రాంతి విడుదల అంటున్నారే కానీ తేదీపై మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు దర్శక నిర్మాతలు. ఈ రెండు సినిమాలకు కూడా యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. రెండు సినిమా పోస్టర్స్ పై రిలీజ్‌ డేట్‌ ఇవ్వలేదు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు అనుకుంటున్నా కూడా అది వచ్చేలా కనిపించడం లేదు. ముందుకు కానీ.. వెనక్కి కానీ వెళ్లేలా కనిపిస్తుంది.

మరోవైపు మహేష్ బాబు చెప్తే కానీ తన సినిమా గురించి అప్ డేట్ ఇచ్చేలా కనిపించడం లేదు బన్నీ. మరి ఈ రెండు సినిమాల విడుదల తేదీలు.. మన హీరోల ఇగోలు ఎప్పటికి చల్లారతాయో చూడాలిక.

More Related Stories