English   

జక్కన్న తర్వాత త్రివిక్రమే...వైరల్ అవుతోన్న పిక్

Trivikram Srinivas
2020-01-04 11:57:43

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అల వైకుంఠ పురంలో. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలవడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు రెండు వారాలు ఉండగానే ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ కోసం అప్పుడే కటౌట్లు పెట్టేస్తున్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ బన్నీ అభిమానులు గోదావరి జిల్లాల్లో ఒక థియేటర్ వద్ద అల్లు అర్జున్ కటౌట్ తో పాటు త్రివిక్రమ్ కటౌట్ ను కూడా పెట్టారు. అది కూడా అల్లు అర్జున్ కు సమానమైన కటౌట్ పెట్టి మరీ అభిమానులు తమ అభిమానం చాటుకున్నారు. దర్శకులకు కటౌట్లు చాలా తక్కువ గా మనం చూస్తూ ఉంటాం. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ కు దక్కిన అరుదైన గౌరవం త్రివిక్రమ్ కు కూడా దక్కిందని ఆయన అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు.   ఈ పిక్ ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

More Related Stories