English   

రజనీ అదరకొట్టారట..దర్బార్ సెన్సార్ టాక్ 

Darbar Censor Talk
2020-01-04 12:29:18

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార లీడ్ రోల్స్ లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. తాజాగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు, ఇక ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు  జారీ చేసినట్టు ప్రకటించింది సినిమా యూనిట్. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని, రజినీకాంత్ నటన చాలా బాగుందని చెబుతున్నారు. పోలీస్ పాత్రలో రజినీ యాక్టింగ్‌ టాప్ లేవడం ఖాయమని సెన్సార్ సభ్యులు చెప్పారట. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో అలాగే కామెడీ సన్నివేశాలలో రజినీ పర్ఫార్మెన్స్‌కు వారంతా షాకైనట్లు చెబుతున్నారు. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 39 నిమిషాలు ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించారు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను NV ప్రసాద్, UV వంశీలు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జనవరి 9న విడుదలకానుంది.

More Related Stories