English   

డర్టీ హరి ఫస్ట్ లుక్...మరీ డర్టీగా ఉన్నాడే 

Dirty Hari
2020-01-04 12:36:01

మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు తర్వాత కాలంలో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా మారిన ఆయన తూనీగా తూనీగా, వాన లాంటి సినిమాలు తెరకెక్కించారు. అయితే ఆ సినిమాలి బాగానే ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టడంతో ఆ తర్వాత ఆయన సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్‌ రాజు తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు రెడీ అయ్యారు.తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘డ‌ర్టీ హ‌రి’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఫిక్స్ చేస్తూ నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈరోజు కొద్ది సేపటి క్రితమే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూడటానికి చాలా బోల్డ్ గా ఆసక్తికరంగా ఉంది. బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ చూస్తుంటే మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. నూతన నటుడు శ్రవణ్ రెడ్డి హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్న ఈ సినిమాని గూడూరి శివ‌రామకృష్ణ‌, గూడురు స‌తీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేష‌న్స్ బేన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు ఎంఎస్ రాజు రాయ‌డంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories