English   

రాజశేఖర్ స్థానంలో తన తమ్ముడిని నిలబెడుతున్న చిరంజీవి..

Srikanth
2020-01-04 17:09:15

చాలా రోజుల తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో కూడా పెద్దగా పట్టి పట్టనట్టు ఉన్నా.. మొన్న జరిగిన డైరీ ఆవిష్కరణ తర్వాత మాత్రం చాలా సీరియస్ అయిపోయాడు. ముఖ్యంగా రాజశేఖర్ ఎపిసోడ్ తర్వాత చిరంజీవిలో చాలా మార్పు కనిపించింది. మా అసోసియేషన్ లో కొన్నేళ్లుగా చాలా గొడవలు జరుగుతున్నా కూడా చిరంజీవి పెద్దగా స్పందించలేదు. వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారులే అన్నట్లే వదిలేశాడు. అయితే మొన్న తన ఎదురుగానే రాజశేఖర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసరికి మెగాస్టార్ బాగా హర్ట్ అయ్యాడు. అది జరిగిన కాసేపటికే రాజశేఖర్ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. దానికి సంబంధించిన లేఖ కూడా మీడియాకు విడుదల చేశాడు. కేవలం మా అధ్యక్షుడు నరేష్ కారణంగానే తాను ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగట్లు క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్. ఇప్పుడు ఈ స్థానంలోకి చిరంజీవి ఎవరూ ఊహించని వ్యక్తిని తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి కూడా ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఉపాధ్యక్షుడు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ మా ఎన్నికలు నిర్వహించాలని అని అనుకుంటున్నా కూడా చిరంజీవి మాత్రం ఏమీ అవసరం లేదు.. శ్రీకాంత్ ను ఉపాధ్యక్షుడిగా కూర్చోబెట్టండి అంటూ ఆజ్ఞ జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజశేఖర్ చేతిలోనే శ్రీకాంత్ ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో అదే పదవిలో శ్రీకాంత్ కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు మెగాస్టార్. 

More Related Stories