English   

యాక్టింగ్ తో పాటు బిజినెస్ కూడా చేస్తున్న మన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..

 Tollywood Stars
2020-01-04 18:59:00

నటులు అంటే కేవలం నటించాలి.. ఇంకేం చేయకూడదు అనే రోజులు పోయాయి. ఇప్పుడు హీరోలు కూడా చాలా చేస్తున్నారు. కేవలం నటించడం తోనే తమ పని అయిపోయింది అనుకోవటం లేదు. వాళ్ళు దానికి మించి చాలా చేస్తున్నారు. ముఖ్యంగా మన హీరోలు అంతా బిజినెస్ పై బాగానే దృష్టి పెడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పుడు సైడ్ బిజినెస్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరో నాగార్జున.. ఈయన కేవలం నటన మాత్రమే వృత్తిగా తీసుకోలేదు. ముందు నుంచి కూడా చాలా మంచి బిజినెస్ మాన్. స్టార్ మా ఛానల్ లో ఇప్పటికీ కొన్ని భాగస్వామ్యాలు ఉన్నాయి. దాంతో పాటు ఇంకా చాలా వ్యాపారాలు చేస్తున్నారు నాగార్జున. ఈయనకు తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ బిజినెస్ మాన్ అనే పేరు కూడా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈయన పేరు మీద ఉంది.

మెగాస్టార్ చిరంజీవి కూడా మంచి బిజినెస్ మాన్. కాకపోతే ఈ బయటకి పెద్దగా కనిపించరు. ఆ మధ్య సచిన్ టెండూల్కర్ తో కలిసి ఒక ఫుట్బాల్ టీమ్ కూడా కొన్నాడు మెగాస్టార్. దాంతో పాటు నాగార్జునతో కలిసి మాటీవీ లో కొన్ని పెట్టుబడులు కూడా పెట్టాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. రామ్ చరణ్ కూడా పోలో టీం కొన్నాడు. దాంతోపాటు గుర్రాల బిజినెస్ కూడా చేస్తాడు చరణ్. దాంతోపాటు ఎయిర్లైన్స్ బిజినెస్ కూడా చేశాడు. ఇవన్నీ ఉండగానే నిర్మాతగా కూడా మారాడు రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు మెగా పవర్ స్టార్.

విజయ్ దేవరకొండ సైతం అర్జున్ రెడ్డి సినిమా తర్వాత తనకు వచ్చిన ఇమేజ్ ను సరిగా వాడుకునే పనిలో పడ్డాడు. అందుకే రౌడీ అంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి క్లోత్ బిజినెస్ మొదలు పెట్టాడు. అది కాస్తా యూత్ కు బాగా నచ్చేసింది. ఇక ఇప్పుడు మరో బిజినెస్ కూడా మొదలు పెడుతున్నాడు. మహేష్ బాబు మాది కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఏషియన్ సినిమాస్ తో కలిసి ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మించే పనిలో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. దీనికి AVD మల్టీప్లెక్స్ అనే పేరు పెడుతున్నాడు రౌడీ.

రానా కూడా ప్రత్యేకంగా మేనేజింగ్ బిజినెస్ లోకి దిగాడు. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లను పరిచయం చేసే ఒక రిఫరెన్స్ సంస్థ ఇది. మహేష్ బాబు సైతం సినిమాలతో పాటు మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెట్టాడు. ఏ ఎం బి సినిమాస్ పేరుతో ఈయన హైదరాబాద్ లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి థియేటర్ బిజినెస్ చేస్తున్నాడు సూపర్ స్టార్. దాంతో పాటు బ్యూటీ రంగం లోకి కూడా అడుగు పెడుతున్నాడు. ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనింగ్ వేర్లతో బిజినెస్మేన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు సూపర్ స్టార్.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కూడా బిజినెస్ మొదలు పెట్టాడు. ఇస్మార్ట్ పేరుతో బట్టల దుకాణం ఓపెన్ చేసాడు. చార్మి తో కలిసి ఈ సైడ్ బిజినెస్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్.  వీళ్లతో పాటు ఇంకా చాలా మంది హీరోలు కూడా సైడ్ బిజినెస్ చేస్తున్నారు. 

సందీప్ కిషన్, తరుణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఫుడ్ బిజినెస్ తో బిజీగా ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా నాలుగు రాళ్ళు సంపాదించిన తర్వాత వాటిని ఎలా దాచుకోవాలి ఇంకా ఎలా ఆస్తులు పెంచుకోవాలి అనే పనిలో బిజీగా ఉన్నారు. మొత్తానికి మన హీరోలు కేవలం హీరోలు మాత్రమే కాదు మంచి బిజినెస్ మైండ్ ఉన్న వ్యక్తులు కూడా. 

More Related Stories