English   

కొత్త వ్యాపారం మొదలెట్టిన అలీ...నో పాలిటిక్స్

ali
2020-01-05 06:43:14

మనం టాలీవుడ్‌ నుండి హాలీవుడ్ వరకు అన్నీ చూశాం. మనకి అలీవుడ్ కూడా ఇప్పుడు పరిచయం కాబోతోంది. ఓర్నీ ఇదేంది కొత్త వుడ్ అనుకుంటున్నారా ? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు స్టార్ కమెడియన్ హోదా అనుభవించి ఇప్పుడు సినిమాలు తగ్గినా అలీ ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. దాని పేరే అలీవుడ్. అలీకు ఈ మధ్య సినిమాలు తగ్గిపోయాయి. ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఏదైనా పెద్ద నామినేటెడ్ పదవి వస్తుందని భావించినా అది అందని ద్రాక్షే అయ్యింది. ఇక సినిమాలతో లాభం లేదనుకున్న అలీ ఇప్పుడు డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నిర్మాణాలు ప్రారంభించాలన్నది ఈ సంస్థ సంకల్పమట.

ఈ సంస్థ నుండి వెబ్ సిరీస్, టీవీ షోలు, డైలీ సీరియల్స్, వాణిజ్య చిత్రాలు రూపొందించే ఆలోచనలో ఉన్నారు అలీ. నష్టాలు లేకుండా నిర్మాతలకు అదాయం లభించే అవకాశం మా అలీవుడ్ సంస్థ కల్పిస్తుందని చెబుతున్నారు అలీ. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన సేవలను తమ సంస్థలో కల్పిస్తున్నామని, తాను తీయబోయే వెబ్ సిరీస్, టీవీ షోలను అభిమానులు ఆదరించాలని అలీ కోరుతున్నారు. అయితే అలీ నిర్మాణం వరకే పరిమితం అవుతారా లేక నటించడం కూడా చేస్తారా అనేది చూడాల్సి ఉంది. శ్రీబాబా నేతృత్వంలో క్రియేటివ్ డైరెక్టర్ మనోజ్ హుస్సేన్ ఆద్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ నడుస్తుందట.  

 

More Related Stories