అమ్మో మలంగ్...ఆ కిస్ సీన్ కోసం రెండు రోజులంట

ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘మలంగ్’. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదల అయ్యాయి. వాటిలో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీకి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. ఈ పోస్టర్ లో దిశ ఆదిత్య భుజాలపై కూర్చుని మరీ అతనికి లిప్ లాక్ ఇస్తున్నట్లు ఉంది. మహా మాస్ గా ఉన్న ఈ పోస్టర్ కి చాలా మంది కిక్కిస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్‌లుక్ పోస్టరే ఈ రేంజ్లో ఉంటే ఇక సినిమాలో వీరి మధ్య ఆ సన్నివేశాలు ఇంకెలా ఉంటాయోనని తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ 6న విడుదల చేస్తారట. ‘మలాంగ్’ సినిమాలో ఓ ముద్దు సన్నివేశం కోసం హీరోహీరోయిన్లు రెండు రోజులు ముద్దుల శిక్షణ తీసుకున్నారనే వార్త ఇప్పుడు రచ్చ రేపుతోంది. అయితే దిశ టైగర్ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో ప్రచారంలో జరుగుతుంది. ఇలా చేస్తే ఆమె ప్రియుడు టైగర్ ష్రాఫ్ పరిస్థితేంటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.