English   

బాలీవుడ్ లోకి వెంకీ మామ..మరో రీమేక్

venky
2020-01-05 08:02:12

దర్శకుడు బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ ‘వెంకీమామ’. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే రిలీజ్‌ అయి సుమారుగా మూడు వారాలు అవ్వొస్తున్నా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా తరువాత ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలై మంత్చి టాక్ లభించినా వెంకీ మామ జోరు కూడా కొనసాగుతోంది. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారట అక్కడి నిర్మాతలు. ఈ సినిమాను చూసిన బాలీవుడ్ వర్గాల వారు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబుకు మంచి ఫ్యాన్సీ రేట్ ని కూడా ఒక నిర్మాత ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అక్కడి ప్రేక్షకులకి తగ్గట్టుగా బాలీవుడ్ లో సినిమా స్క్రీన్ ప్లేను కాస్త మార్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి సురేశ్ బాబు ఏమంటారో ?

More Related Stories