English   

శ్రీదేవి మరణం వెనుక అసలు నిజాలు చెప్పిన బాలీవుడ్ రైటర్..

sri
2020-01-05 11:46:54

అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఆమెను ఇంక మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటికీ ఆమె ధ్యాస లోనే ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా శ్రీదేవి మరణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దుబాయ్ లో పెళ్లి కోసం వెళ్లిన శ్రీదేవి అక్కడే అనుమానాస్పద రీతిలో బాత్ టబ్బులో పడి చనిపోయింది. దుబాయ్ పోలీసులు ఇది హత్య లేదంటే అనుకోకుండా జరిగిందా అని తేల్చడానికి నాలుగు రోజులపాటు శ్రీదేవి శవాన్ని అక్కడే ఉంచుకున్నారు. అప్పట్లో దీనిపై చాలా పెద్ద చర్చ జరిగింది కూడా. చివరికి శ్రీదేవి మద్యం మత్తులో చనిపోయిందని.. ఆమెను ఎవరు హత్య చేయలేదని తేల్చారు దుబాయ్ పోలీసులు. ఇక ఇప్పుడు ఈమె మరణంపై బాలీవుడ్ రచయిత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె మద్యం మత్తులో బాత్ టబ్‌లో పడి మునిగి చనిపోయిందని డాక్టర్లు తేల్చడం.. దుబాయ్ పోలీసులు కూడా అదే వివరాలను నమోదు చేసుకుని కేసు క్లోజ్ చేయడంతో ఈ విషయం ప్రశ్నార్ధంకంగానే మిగిలింది.

ఇదిలా ఉంటే సత్యర్థ్ నాయక్ అనే రచయిత ఇటీవల శ్రీదేవి బయోగ్రఫీ రాశారు. అందులో మీ కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలను కూడా పొందుపరిచాడు. ఈ బయోగ్రఫీలో శ్రీదేవి గురించి బయట ప్రపంచానికి తెలియని  విషయాలను  రాసాడు నాయక్. శ్రీదేవికి రక్తపోటు ఉందని పంకజ్ పరాషర్‌, నాగార్జున చెప్పారని రాశారు. షూటింగ్ సమయంలో ఆమె చాలా సార్లు కళ్ళు తిరిగి పడిపోయిందని.. ఓసారి ఇలాగే బాత్రూంలో పడిపోతే మొహానికి పెద్ద గాయం కూడా అయిందని శ్రీదేవి మేనకోడలు చెప్పారని బయోగ్రఫీలో రాశాడు. ఇంకోసారి వాకింగ్ చేస్తూ శ్రీదేవి కుప్పకూలిందని బోని కపూర్ తెలిపినట్టు సత్యర్ధ్ తెలిపారు. మొత్తానికి దుబాయ్ లో కూడా అలాగే జరిగి ఉంటుందని నాయక్ తన బయోగ్రఫీలో చెప్పాడు.

More Related Stories