English   

నాగబాబుకి దిమ్మతిరిగే షాక్.. రేటింగ్స్ అదరలేదు..

nag
2020-01-05 12:01:10

నిజంగానే ఇప్పుడు నాగబాబుకు అదిరిపోయే షాక్ తగిలింది. ఈయన ఈటీవీలో మానేసి జీ తెలుగులో అదిరింది అంటూ కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టాడు. జబర్దస్త్ కు పోటీగా వచ్చిన ఈ షోపై ముందునుంచి అంచనాలు బాగానే ఉన్నాయి.. ఇప్పటికే ఈషా వచ్చి రెండు వారాలు ముగిసింది. దాంతో రేటింగ్స్ కూడా బయటకు వచ్చాయి. కానీ వచ్చిన తర్వాత కానీ తెలియలేదు జబర్దస్త్ కు అదిరిందికి ఉన్న తేడా ఏంటో. సేమ్ టు సేమ్ జబర్దస్త్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడుకుంటూ షో చేస్తున్నారు నాగబాబు అండ్ గ్యాంగ్. జబర్దస్త్ షో లో డిజైన్ చేసిన దర్శకులు నితిన్ భరత్ ఇప్పుడు అదిరింది ని డైరెక్ట్ చేస్తున్నారు. కానీ భారీ అంచనాలతో వచ్చిన అదిరింది షో టి ఆర్ పి పరంగా మాత్రం అంతగా ఆదరణ లేదు. ఎందుకో తెలియదు కానీ ఈ షోకు రేటింగ్ పెద్దగా రావడం లేదు. దానికి తోడు జీ తెలుగులో అదిరింది వస్తున్న సమయంలోనే ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి ads లేకుండా రిపీట్ షో వేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు ఎక్కువగా దానికే కనెక్ట్ అవుతున్నారు. పాత స్కిట్స్ అయినా కూడా అక్కడ కామెడీ వర్క్ ఔట్ కావడం జబర్దస్త్ బ్రాండ్ తో రేటింగ్స్ బాగా వస్తున్నాయి. ఇదే సమయంలో నాగబాబుకి మాత్రం అదిరింది షాక్ ఇస్తుంది. దీనికి అనుకున్న రేటింగ్ రాకపోతే కచ్చితంగా ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకోవడానికి జీతెలుగు ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అదిరింది రేటింగ్స్ పెంచడానికి నాగబాబు చాలా ట్రై చేస్తున్నాడు. జబర్దస్త్ కి పోటీగా వచ్చినా అదిరింది స్థాయికి తగ్గట్లుగా అదరగొట్టడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది.

More Related Stories