English   

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ కోసం భారీగా ఏర్పాట్లు..

sari
2020-01-05 15:14:11

మహేష్ బాబు సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5 సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉండటంతో ఎల్బీ స్టేడియంను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు ఈవెంట్ మేనేజర్స్. దీనికి మహేష్ బాబుతో పాటు చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ కూడా ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు సినిమా వేడుకకు చిరంజీవి అతిథిగా రానుండటం ఇటు మెగా అటు ఘట్టమనేని అభిమానులకు పండగ వాతావరణంలో మారిపోయింది.

గతంలో భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా ఇక్కడే జరుగుతుండటంతో కచ్చితంగా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి కావడం.. దానికి మంచి టాక్ రావడంతో సంతోషంగా ఉన్నాడు సూపర్ స్టార్. గత వారం రోజులుగా ఫ్యామిలీతో పాటు ఫారెన్ లో ఎంజాయ్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చేశాడు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 థియేటర్లలో విడుదల కానుంది.

More Related Stories