English   

అనిల్ రావిపూడి ఇంట ముందే వచ్చిన సంక్రాంతి..

anil
2020-01-05 16:03:13

ఈ సంక్రాంతి పండుగ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను అంటూ అనిల్ రావిపూడి కొన్ని ఇంటర్వ్యూలలో చెబుతూనే ఉన్నాడు. అయితే అది కేవలం ప్రొఫెషనల్ గానే కాకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ఈ సంక్రాంతి ఆయనకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారిపోయింది. ఈయన కుటుంబంలోకి మరో వారసుడు వచ్చాడు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతుంటే.. దానికి వారం రోజుల ముందు తన సతీమణి విలువైన వరం అందించింది. అనిల్ సతీమణి భార్గవి జనవరి 5న మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో డుబల్ జోష్ లో ఉన్న అనిల్ రావిపూడికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తున్నాయి. స్వయంగా హీరో మహేష్ బాబు ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తమ దర్శకుడు అనిల్ రావిపూడికి మగబిడ్డ పుట్టాడని తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు సూపర్ స్టార్. ఈ సందర్భంగా అనిల్-భార్గవి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్.. తల్లిదండ్రులుగా గర్వించాల్సిన రోజు ఇదని తెలిపారు. తన ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ అనిల్ కు ఉంటాయని ట్వీట్ చేశాడు. తనకు ఇంత అద్భుతమైన విషెస్ చెప్పిన మహేష్ బాబుకు రిప్లై ఇచ్చాడు అనిల్ రావిపూడి. అమితమైన మీ ప్రేమకు ధన్యవాదాలంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా అనిల్ -భార్గవి దంపతులకు ఇప్పటికే ఒక కుమార్తె శ్రేయాస్వి ఉండగా రెండో సంతానంగా మగబిడ్డ జన్మించాడు. సరిలేరు నీకెవ్వరు సమయంలో పుట్టిన తన ముద్దుల కుమారుడికి అనిల్ ఏం పేరు పెడతాడో చూడాలి. మొత్తానికి ఒకేసారి అనిల్ రావిపూడి ఇంట రెండు సంక్రాంతులు వచ్చాయి.

 

More Related Stories