English   

ఇదో మైల్ స్టోన్ ఈవెంట్ అవుతుందా

event
2020-01-05 16:20:23

మెగాస్టార్‌ చిరంజీవి... సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు... లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి... ఒకే వేదికపై సందడి చేయనున్నారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. మహేశ్‌ ఫ్యాన్స్‌ , మెగా అభిమానులు  వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి వెండి తెరపై మెరవబోతున్న సినిమా కావడంత్ ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్ సినిమా కోసం తొలి సారి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరుకానుండడం ఇక మెగాస్టార్, సూపర్ స్టార్, విజయశాంతి ఒకే వేదికపై కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వేల సంఖ్యలో అభిమానులు హాజరు కానున్నారు. అందుకే హైదరాబాద్ నగర పోలీసులు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అడిషనల్ సిపి అనిల్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటనలు అవీ చూస్తుంటే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ టాలీవుడ్ ఈవెంట్స్ కే హైలైట్ గా నిలవనుందని చెప్పచ్చు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.  

 

More Related Stories