English   

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

slient
2020-01-05 16:43:36

వరుడు సినిమా రిలీజ్ కు ముందు హీరోయిన్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ డిజాస్టర్ టాక్ ను అందుకుంది. సినిమాలో అద్భుతంగా నటించినప్పటికీ భాను మీద పెరిగిన అంచనాలు కెరీర్ ని కోలుకోలేని దెబ్బకొట్టాయి. సినిమా ప్రచారం కోసం ఈమెను ప్రచారంలో పెద్దగా చూపించలేదు. ఆ తర్వాత అవకాశాలు లేక ఆమె ఎవరికీ కనిపించలేదు. చరణ్ నటించన గోవిందుడు అందరివాడేలే’లో అతిథి పాత్రలో ఆమె మెరిసింది. ఆ తర్వాత్త బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి, అలా ఎలా సినిమాల్లో నటించినా అవేవీ ఆమెకి బ్రేక్‌ ఇవ్వలేదు. ఇక  ప్రస్తుతం ఆమె తనీష్ హీరోగా నటిస్తున్న మహాప్రస్తానం సినిమాలో నటిస్తోంది. అయితే ఆమె రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. నవంబర్ 1న కరన్ అనే ఆమె ప్రేమించిన వ్యక్తితో భాను వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్ళికి కుటుంబ సభ్యులు అలాగే అతి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారని సమాచారం. వీరి వివాహం పంజాబ్ సాంప్రదాయ పద్ధతుల్లో జరిగిందని చెబుతున్నారు. ఇక తన పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది భాను.

More Related Stories