English   

సినిమా చేయాలంటే ఆ కండిషన్స్ ఓకే అవ్వాలట

vijay
2020-01-06 05:05:52

ఒకటి రెండు కాదు.. దాదాపు 13 ఏళ్ళ తర్వాత మళ్లీ తెలుగు తెర మీద రీ ఎంట్రీ ఇస్తోంది విజయశాంతి. ఆమె చివరి సినిమా నాయుడమ్మ ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్రలో నటించింది లేడీ సూపర్ స్టార్. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇన్నేళ్ళ తర్వాత ఆమె మళ్ళీ నటించడానికి ఒప్పుకుందంటే కచ్చితంగా అందులో ఎంత విషయం ఉందో అర్థమైపోతుంది. ఇక ఈ సినిమాని బేస్ చేసుకుని ఈ సినిమా అనంతరం నటిగా కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటుంది విజయశాంతి. ఇప్పటికే పలువరు దర్శక నిర్మాతలు విజయశాంతి డేట్స్‌ కోసం ఆమెను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అయితే అందరికీ ఆమె రెండు కండిషన్స్‌ గట్టిగా చెపుతున్నారట. తనకు స్టార్ హీరోయిన్‌ స్థాయిలో రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని, అలాగే సినిమాలో ప్రాధాన్యమున్న పాత్ర అయితేనే చేస్తానని ఆమె ముందే చెప్పేస్తోందట. దీంతో ఆమెని సినిమాలోకి తీసుకోవాలని భావించిన దర్శక నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారు. భారీ రెమ్యూనరేషన్‌ ఇచ్చి తీసుకున్నా సినిమాలో కీలక పాత్ర అనే కొంచెం కష్టమే నని ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే తల్లి పాత్రలకు సీనియర్‌ హీరోయినలు నదియా,సీత వంటి గ్లామరస్‌ మదర్స్‌ కూడా ఉన్నారు. మరి ఈ సమయంలో విజయశాంతికి భారీ రెమ్యూనరేషన్‌ ఇచ్చి తీసుకుంటారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.

 

More Related Stories