English   

సరిలేరు నీకెవ్వరు ట్రైలర్.. బొమ్మ దద్దరిల్లిపోతుంది..

trailer
2020-01-06 05:18:44

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసి వాటిని మరింత పెంచేసాడు దర్శకుడు అనిల్. ముఖ్యంగా మహేష్ బాబుతో పంచ్ డైలాగులు చెప్పించాడు ఈ కుర్ర దర్శకుడు. వేరియేషన్స్ లేకపోయినా కూడా మరోసారి పక్కా ఫార్ములా సినిమాతోనే వస్తున్నాడు ఈయన. సాధారణంగా అనిల్ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి కూడా ఇదే చేస్తున్నాడు ఈ దర్శకుడు. ట్రైలర్ మొదలైన నిమిషం పాటు నాన్ స్టాప్ కామెడీ సీన్స్ పెట్టాడు అనిల్. ఆ తర్వాత యాక్షన్ లోకి దిగాడు. సీరియస్ సబ్జెక్టును తీసుకుని కథగా మలిచాడు అనిల్ రావిపూడి. దానికి యాక్షన్ ఫార్ములాను జోడించాడు ఈ కుర్ర దర్శకుడు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ కూడా సినిమాకు ప్లస్ కానుంది. ఇక విజయశాంతి కూడా చాలా సీరియస్ రోల్ లో కనిపించింది. తొలిసారి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తగలడంతో పక్కాగా ఆయన ఇమేజ్‌కు తగ్గట్లుగా కథ రాసుకున్నాడు అనిల్ రావిపూడి.

టీజర్‌లో కొత్తదనం లేకపోయినా కూడా హిట్ ఫార్ములా మాత్రం కనిపిస్తుంది. మిలటరీలో పని చేసే మహేష్ బాబు.. సమాజంలో జరిగే అక్రమాలను చూసి ఎలా రియాక్ట్ అయ్యాడన్నది సరిలేరు నీకెవ్వరు కథగా కనిపిస్తుంది. ట్రైలర్ లోనే చిన్నసైజ్ కథ చెప్పేసాడు దర్శకుడు. విజయశాంతి పాత్రను కూడా పరిచయం చేసాడు. భయపడేవాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవు అంటూ టీజర్ లో చెప్పిన డైలాగ్ ఇంకా మరిచిపోలేదు ఇప్పుడు ట్రైలర్ లో కూడా అలాగే దున్నేసాడు. చిన్న బ్రేక్ ఇస్తున్నా.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోతుంది అంటూ చివర్లో చెప్పేసాడు మహేష్. మొత్తానికి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలను ట్రైలర్ లో పొందుపరిచాడు అనిల్ రావిపూడి. ఇదంతా చూస్తుంటే నిజంగానే ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చేలా కనిపిస్తున్నాడు. జనవరి 11న సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చేస్తున్నాడు.

 

More Related Stories