English   

విజయశాంతితో అందరిముందే చిరు సరసాలు.. 

 Chiranjeevi
2020-01-06 13:42:41

మెగాస్టార్ చిరంజీవితో విజయశాంతికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఈ ఇద్దరూ కలిసి నటించారంటే బాక్సులు బద్దలైపోయేవి. తన కెరీర్ లో అత్యధికంగా చిరుతోనే కలిసి నటించింది విజయశాంతి. ఒకటి రెండు కాదు ఏకంగా 20 సినిమాల్లో నటించారు ఈ జోడీ. ఇక ఇలాంటిది ఆ తర్వాత అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం.. రాజకీయాల్లో బిజీగా ఉండటం.. కనీసం కలుసుకోలేని బిజీ అయిపోవడంతో ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. అయితే ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ మహేష్ బాబు పుణ్యమా అని కలిసారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో లేడీ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటించారు. నాయుడమ్మ తర్వాత 13 యేళ్ల గ్యాప్ అనంతరం ఆమె నటించిన చిత్రమిది. హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో చిరు ముఖ్య అతిథిగా వచ్చాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య పాత స్నేహం మళ్లీ చిగురించింది. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నది మహేష్ బాబు ఈవెంట్ అయినా కూడా తన మాటలతో మ్యాజిక్ చేసాడు మెగాస్టార్. స్టేజ్ పై మెగాస్టార్ షో చూసి అంతా ఫిదా అయిపోయారు. 

మరీ ముఖ్యంగా విజయశాంతితో ఓ ఆటాడుకున్నాడు చిరంజీవి. అసలు నన్ను ఎలా తిట్టాలనిపించింది శాంతి.. అన్ని విమర్శించినా కూడా ఒక్కసారి కూడా నిన్ను నేను తిట్టలేదు తెలుసా అంటూ తన మార్క్ సరసమాడారు చిరంజీవి. దానికి విజయశాంతి కూడా ధీటైన సమాధానం చెప్పింది. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు.. మీరు ఎప్పటికి నా ఫేవరేట్ హీరో అంటూ చిరంజీవిని కౌగిలించుకుంది విజయశాంతి. సరిలేరు ఈవెంట్ లో మహేష్ కంటే కూడా చిరంజీవి, విజయశాంతి బాగా హైలైట్ అయ్యారు. ఏదేమైనా కూడా ఈ ఇద్దరి మాటల గారడి చూసి అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. 

More Related Stories