English   

మహేష్ బాబు ప్లాన్ సక్సెస్.. బన్నీకి బిగ్ షాక్.. 

 Sarileru Neekevvaru
2020-01-06 15:02:07

అవును.. ఇప్పుడు అంతా ఇదే అనుకుంటున్నారు కూడా. సూపర్ స్టార్ కృష్ణను కాదని మరీ చిరంజీవిని చీఫ్ గెస్టుగా పిలవడం ఏంటబ్బా అనుకున్నారు కానీ మహేష్ బాబు ప్లాన్ మాత్రం అదిరింది. ఈయన ప్లాన్ వర్కవుట్ అయిందిప్పుడు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ముందు నుంచి కూడా అంతా బాగానే ఉన్నా చివర్లో చిరంజీవి స్పీచ్ తో బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈవెంట్. 

విజయశాంతితో ఆయన చేసిన కామెడీ అదిరిపోయింది. పాత లవర్ ను కలుసుకున్నపుడు ఉప్పొంగిన ప్రేమలా ఇద్దరూ మాట్లాడుకున్న తీరు.. స్టేజీపై వాళ్ళ రొమాన్స్ అబ్బో అదుర్స్ అంతే. ఇదంతా చూస్తే వెనక నుంచి మహేష్ బాబు తెగ నవ్వేసుకున్నాడు కూడా. ఎందుకంటే సినిమా ప్రమోషన్ కు ఇదంతా బాగానే పనికొచ్చింది మరి. నిజంగా చూస్తున్న వాళ్లకు ఇదంతా ప్రీరిలీజ్ వేడుక మాదిరి లేదు.. విడుదలైన తర్వాత చేసుకునే సక్సెస్ సంబరాల మాదిరే ఉంది. అంతగా ఈ ఈవెంట్ సక్సెస్ అయిపోయింది. 

అందుకే అన్నీ మరిచిపోయి మహేష్ బాబు కూడా సంబరాలు జరుపుకుంటున్నట్లు చేసుకున్నాడు ఈ వేడుకను. ఇప్పుడు అల్లు అర్జున్ కు అసలు పరీక్ష ముందుంది. ఈయన అల వైకుంఠపురములో ఈవెంట్ కూడా ఇంతే ఘనంగా చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అది కూడా ఇంతే ఘనంగా సక్సెస్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

More Related Stories