తమన్నా దేవిని తిట్టిందా.. పోగిడిందా

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది.
ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసిన తమన్నా నిన్న స్టేజ్ మీద కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. డాంగ్ డాంగ్ సాంగ్‌కు డ్యాన్స్ వేసి అందరినీ అలరించింది. ఇక డ్యాన్స్ తరువాత తమన్నాకి మైక్ అందించింది యాంకర్ సుమ. ఈ క్రమంలో అందరికీ వరుసగా బిస్కెట్స్ వేస్తూ వచ్చిన తమ్మూ మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ కాస్త కాస్త నోరు జారిపోయింది మిల్కీ బ్యూటీ.
డీఎస్పీ ఇంకేం చేస్తావు రా నువ్వు. ఇన్ని మంచి సాంగ్స్ తరువాత మేమేం చేయాలి అంటూ తన ముద్దుగా ప్రశంసించడం ఇప్పుడు ట్రోలర్స్ కి వరంలా దొరికింది. ఆ సంగతి పక్కన పెడితే స్టేజ్ మీద నుండే తనను తమన్నా రేయ్ అనడంతో డీఎస్పీ షాక్ కు గురయ్యాడు. గతంలో చరణ్‌పై కూడా ఇలాంటి కామెంట్లే చేసింది తమన్నా. సైరా సక్సెస్‌మీట్‌లో మాట్లాడిన తమన్నా నిన్ను నిర్మాతగా చూడాలా..? హీరోగా చూడాలా..? ఏం చెప్పాలి రా నీ గురించి అంటూ ప్రేమగా మాట్లాడింది ఆమె.
ఇక ఈ సినిమాకి దేవి శ్రీ అందిస్తున్న పాటల మీద ఇప్పటికే ఒక రేంజ్ లో రచ్చ నడుస్తోంది. సాంగ్స్ అసలు ఏమీ బాలేదని దేవి మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో తమన్నా దేవిని పొగడలేదు తిట్టింది అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.