English   

రాజశేఖర్‌ రాజీనామా ఆమోదం..క్రమశిక్షణ కమిటీ కూడా

Rajasekhar
2020-01-06 15:44:48

సినీ నటుడు రాజశేఖర్‌ రాజీనామాను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆమోదించింది. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మా అధ్యక్షుడు నరేశ్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. అనంతరం  రాజశేఖర్.. తన పదవికి రాజీనామా చేశారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్ పని చేశారు.

నిన్న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రాజశేఖర్ రాజీనామాను ఆమోదించారు. అంతేకాదు రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్యలకు చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీమోహన్, జయసుధతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయం మేరకు రాజశేఖర్‌పై చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు రాజశేఖర్ రాజీనామాను ఆమోదిస్తూ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది.  మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, క్రిష్ణం రాజులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్ ముఖ్య ప్రముఖులు పాల్గొన్నారు.

అయితే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్న సందర్భంలో రాజశేఖర్ పదే పదే అడ్డుపడతూ వేదికపై రచ్చ చేయడంపై మెగాస్టార్ ఫైర్ అయ్యారు. ఇదేనా సంస్కారం.. ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి. ఈ క్రమంలోనే  చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీమోహన్, జయసుధల పేరిట ఒక క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు.
 

More Related Stories