English   

కృష్ణకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలన్న చిరు...

Chiranjeevi
2020-01-06 16:08:00

సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చిరంజీవి. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి... నటశేఖరుడు కృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు చేసిన కృష్ణ ఇప్పటి వరకు సరైన గౌరవం దక్కలేదన్నారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. 

తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగి నటుడు కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పటికే  రావాల్సిందన్న చిరు ఆ దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే రావడం తన కోరిక మాత్రమే కాదని అది డిమాండ్ అని స్పష్టం చేశారు. 350 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన కృష్ణ...ఆధునిక సాంకేతను తెలుగు తెరకు పరిచయం చేశారని గుర్తు చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అన్ని విధాలా అర్హుడు కృష్ణ మాత్రమేనన్ననారు చిరంజీవి. 

ఇక మహేష్ బాబు తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతూ...కృష్ణ గర్వించే స్థాయికి చేరుకున్నారని  ప్రశంసించారు. అయితే చిరంజీవి డిమాండ్ బాగానే ఉన్నా అయన మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు కొంత మంది. ఎందుకంటే మొన్నీ మధ్య చిరంజీవి రాష్ట్రపతి కావడం తన ధ్యేయం అని అల్లు అరవింద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో చిరంజీవికి సంబంధం లేకున్నా ఇప్పుడు ఆ విషయాన్ని పేర్కొంటూ ట్రోల్ చేస్తున్నారు. మీరు రాష్ట్రపతి అయ్యాక ఆ పని చేద్దురులే అంటూ ట్రోల్ చేస్తున్నారు కొంత మంది. 
 

More Related Stories