English   

ఈ ముగ్గురే నా బలం...నమ్రత ఎమోషనల్ పోస్ట్

Namrata
2020-01-06 16:36:37

ఈ మధ్య మనందరి జీవితాల్లో సోషల్ మీడియా ఒక భాగమై పోయింది. ఎంతగా అంటే ఏమి చేస్తున్నా చూస్తున్నా అది సోషల్ మీడియా కోణం నుండి చూసేంతగా. ఇక ఈ సోషల్ మీడియా ప్రముఖులకి బాగా ఉపయోగపడుతోంది. తమ తమ అభిమానులతో టచ్ లో ఉండడానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ ని సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. 

ఎందుకంటే నమ్రత కృష్ణ, మహేశ్‌బాబు, గౌతమ్‌లే తన బలమని చెబుతూ పోస్ట్ చేశారు. ఈ మేరకు ఆమె కృష్ణ, మహేశ్‌, గౌతమ్‌లకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘ఈ ముగ్గురు నా సూపర్‌ హీరోలు. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవానికి కృతజ్ఞురాలిని. ప్రతి సారీ ఈ ముగ్గురు నాకో కొత్త విషయాన్ని నేర్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీళ్లే నా బలం.’ అని నమ్రత ఆ పోస్ట్ కి కామెంట్ పెట్టారు. ఇక మహేశ్‌ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories