English   

అనిల్ రావిపూడి గురుభక్తి.. శ్రీనువైట్లకు గౌరవం.. 

Anil Ravipudi
2020-01-06 16:52:01

జీవితంలో మనం ఎంత పైకి ఎదిగినా కూడా దానికి కారణం అమ్మానాన్నలతో పాటు గురువులు కూడా ఉంటారు. వాళ్లే లేకపోతే ఏం చేయలేం.. చేసినా కూడా లాభం ఉండదు. అలాంటి గురువులను గుర్తు పెట్టుకుని వాళ్లకు సరైన గౌరవం ఇవ్వాల్సిందే.. ఇచ్చినవాడే మనిషి కూడా. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఇదే చేసాడు. ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక కూడా భారీగానే జరిగింది. దీనికి అతిరథ మహారథులు వచ్చారు. చిరంజీవి కూడా అందులో ఉన్నాడు. అయితే అందరిమధ్య శ్రీనువైట్ల కూడా కనిపించాడు.

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయినా కూడా ఇప్పుడు కనీసం ఈయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మహేష్ బాబుకు దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈయనే.. ఆగడు లాంటి డిజాస్టర్ కూడా ఇచ్చాడు. అయితే శ్రీనువైట్లను ఎవరూ గుర్తు పెట్టుకోలేదు.. ఎక్కడికి పిలవడం లేదు కూడా. కానీ అనిల్ మాత్రం తన గురువును గుర్తుపెట్టుకున్నాడు. తన సినిమా వేడుకకు పిలిచి గౌరవించాడు. అప్పట్లో ఈయన శ్రీనువైట్ల దగ్గరే పనిచేసాడు. దూకుడుతో పాటు మరికొన్ని సినిమాలకు కూడా పని చేసాడు అనిల్ రావిపూడి. అలా శ్రీనువైట్లకు కనెక్ట్ అయ్యాడు అనిల్. దాంతో ఇప్పుడు మళ్లీ ఆయన్ని గుర్తు పెట్టుకుని తన సినిమాకు తీసుకొచ్చి గౌరవమిచ్చాడు ఈ కుర్ర దర్శకుడు. 

More Related Stories