English   

రజినీకాంత్ హిట్ కొట్టకపోతే సిచ్యువేషన్ ఏంటో..

 Rajinikanth
2020-01-06 17:11:58

రజినీకాంత్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 40 ఏళ్లుగా ఇండియన్ సినిమాపై తనకంటూ ప్రత్యేకమైన పేజీ లిఖించుకుని చరిత్ర రాసుకున్నాడు సూపర్ స్టార్. తెలుగు వాళ్లే కాదు.. ఎవరికి వాళ్లు ఈయన మా హీరో అంటూ గర్వంగా చెప్పుకుంటారు. అలాంటి సినిమాలు కూడా చేసాడు రజినీ. 90ల్లోనే ఇండియన్ సినిమాకు కొత్త రికార్డులు చూపించాడు సూపర్ స్టార్. 

కానీ ఎలాంటి హీరో అయినా కూడా కొన్ని రోజుల తర్వాత సత్తా తగ్గించుకుంటాడు కదా.. ఇఫ్పుడు రజినీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన కూడా ఈ మధ్య కాస్త జోరు తగ్గించాడు. వరసగా ఫ్లాపులు ఇస్తూ రేసులో బాగానే వెనకబడిపోయాడు. ఇప్పుడు దర్బార్ అంటూ మరోసారి వస్తున్నాడు సూపర్ స్టార్. సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక కొట్టుకుంటున్నారు. 

ఇలాంటి సమయంలో తమిళనాడు నుంచి రజనీకాంత్ వచ్చాడు. ఇప్పుడు ఆయన చూపిస్తున్న పంతం దర్బార్ సినిమాకు శాపంగా మారేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు థియేటర్లు తెలుగులో దక్కడం లేదని వార్తలు ఇప్పుడు అభిమానులను భాధపెడుతున్నాయి. రజనీకాంత్ సినిమా థియేటర్లు లేకపోవడం ఏంటి వాళ్ళు మౌనంగా రోదిస్తున్నారు. 

ఒకప్పుడు ఈయన సినిమా వస్తుంది అంటే మిగిలిన సినిమాలు రావడానికి భయపడేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రజనీకాంత్ సినిమా కూడా కనీసం పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక బయ్యర్లు కూడా రజనీ సినిమా కంటే కూడా మిగిలిన సినిమాల వైపు అడుగులు వేస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తెలుగులో కొన్ని రోజుల తర్వాత విడుదల చేయాలని ముందు అనుకున్నా కూడా రజనీకాంత్ రెండు భాషల్లో ఒకేసారి రావాలని పట్టుబట్టారు. దాంతో మరో ఆప్షన్ లేక జనవరి 9న విడుద‌ల చేస్తున్నారు దర్బార్ సినిమాను. ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. అయితే మన సినిమాల ముందు దర్బార్ రీ సౌండ్ పెద్దగా వినిపించడం లేదు. కానీ అప్పటికే ఇక్కడ మూడు సినిమాలు థియేటర్లు బ్లాక్ చేసుకున్నాయి. ఇలాంటి సమయంలో వచ్చిన రజినీకాంత్ సరైన స్క్రీన్స్ లేక ఇబ్బంది పడ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. 

ఇప్పుడు ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కానీ జనవరి 11న సరిలేరు నీకెవ్వరు కాబట్టి రెండు రోజుల ముందే దర్బార్ వస్తుండటంతో ఓపెనింగ్స్ వరకు ఢోకా అయితే లేదు. అదొక్కటే ఇప్పుడు రజినీకాంత్ కు వరం. దర్బార్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాల్సిందే లేదంటే మాత్రం రజినీకి తిప్పలు తప్పవు. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి నిరాశ పరచడంతో ఇప్పుడు కచ్చితంగా మాయ చేయాలని చూస్తున్నాడు సూపర్ స్టార్. మురుగదాస్ లాంటి దర్శకుడు తోడుండటంతో కచ్చితంగా హిట్ కొడతాననే చెబుతున్నాడు సూపర్ స్టార్. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..? 

More Related Stories