English   

అల వైకుంఠపురములో సునీల్ కారెక్టర్ ఏంటంటే..

Sunil
2020-01-06 17:43:09

ఆప్షన్ లేదు మీకు అర్థమైంది నాకు.. ప్రస్తుతం సునీల్ కి డైలాగ్ బాగా సూట్ అవుతుంది. ఈయనకు మరో ఆప్షన్ లేదు ఇప్పుడు. హీరోగా నటించిన చాలా సినిమాలు ఇప్పటికే పరాజయం పాలయ్యాయి.. దాంతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు సునీల్. అయితే రీ ఎంట్రీలో ఇప్పటివరకు త‌న మార్క్ చూపించ‌లేదు ఈ క‌మెడియ‌న్. ఏ సినిమాలోనూ క‌డుపులు చెక్క‌ల‌య్యేలా న‌వ్వించ‌లేదు. అరవింద సమేత, చిత్రలహరి సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేసినా కూడా అది కామెడీ రోల్ కాదు. దాంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు పనికొచ్చే మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు సునీల్. 

ఇలాంటి సమయంలో మళ్లీ త్రివిక్రమ్ నే న‌మ్ముకుంటున్నాడు ఈయన. ఈ మధ్యే చాణక్యలో 10 నిమిషాలు కనిపించే పాత్ర కూడా చేసాడు సునీల్. అసలు ఆయన ఉన్నాడనే సంగతిని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. హీరో నుంచి అలా మారిపోయాడు సునీల్. వరసగా సినిమాలు చేసినా కూడా పెద్దగా వర్కవుట్ అయితే కావడం లేదు. దాంతో సునీల్ ఏం చేయాలో.. ఎలాంటి కారెక్టర్స్ చేయాలో కూడా తెలియని కన్ఫ్యూజన్ లో అయితే పడిపోయాడు. 

ముఖ్యంగా తన కెరీర్ కు పూలబాటలు వేసిన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే మరోసారి నమ్ముకుంటున్నాడు ఈయన. త్రివిక్రమ్ కాంబినేషన్లో బ‌న్నీ చేస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు సునీల్. ఈ సినిమాలో టబు ఇంట్లో పనిచేసే వాడిగా కనిపిస్తున్నాడు సునీల్. ఈ సినిమాలో అరవింద సమేత మాదిరి సీరియస్ రోల్ కాదని.. పూర్తి స్థాయి కామెడీ పాత్ర ఇందులో చేయ‌బోతున్నానంటున్నాడు సునీల్. కచ్చితంగా ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశిస్తున్నాడు ఈ భీమవరం బుల్లోడు. 

మొత్తానికి ఎటు తిరిగినా ఏం చేసినా చివరికి మళ్ళీ త్రివిక్రమ్ దగ్గరే వచ్చి ఆగాడు సునీల్. ఒకప్పుడు తన కెరియర్ కు మంచి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించిన స్నేహితుడే ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో తనను నిలబడతాడని ఆశిస్తున్నాడు సునీల్. మరి ఈ నమ్మకాన్ని త్రివిక్ర‌మ్ ఎంతవరకు నిజం చేస్తాడనేది చూడాలి. ఒకవేళ ఈ పాత్ర కానీ క్లిక్ అయితే సునీల్ కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే.. లేదంటే మాత్రం చాలా రోజుల పాటలు కష్టపడక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగులో చాలా మంది కొత్త కమెడియన్లు వచ్చేసారు. దాంతో ఇప్పుడు హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు ఈ సీనియర్ కమెడియన్. అందుకే అల వైకుంఠపురములో సినిమా కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు సునీల్. 

More Related Stories